తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప‌వ‌న్ క‌ల్యాణ్ రీఎంట్రీ.. ఇంకా టైమ్ ఉంద‌ట‌..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై చాలా వార్తలు వస్తున్నాయి. పింక్ రీమేక్​లో చేస్తున్నాడని స్పష్టత కూడా వచ్చింది. అయితే ఈ సినిమా చేసేందుకు ఇంకా సమయం ఉందట. ఇప్పుడే రీఎంట్రీ ఇవ్వకూడదని పవన్ భావిస్తున్నాడట.

పవన్

By

Published : Nov 11, 2019, 12:07 PM IST

'అజ్ఞాత‌వాసి' తర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి మ‌రో సినిమా ఏదీ రాలేదు. ప‌వ‌న్ రాజ‌కీయాల‌తో బిజీ అయిపోయాడు. 'సినిమాల‌ కంటే రాజ‌కీయాలే ముఖ్యం' అని చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. అయితే ఇటీవ‌ల ఈ హీరో రీఎంట్రీపై చాలా వార్త‌లు, క‌థ‌నాలూ వ‌చ్చాయి. 'పింక్‌' రీమేక్‌లో ప‌వ‌న్ నటిస్తున్నాడని ప్ర‌చారం జ‌రిగింది. ఈ విషయాన్ని ప‌వ‌న్ కూడా తోసిపుచ్చ‌లేదు. ఈ కారణంగా సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయం అనుకున్నారంతా. అయితే.. ప‌వ‌న్ రీ ఎంట్రీకి చాలా స‌మ‌యం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్పుడే 'పింక్‌' రీమేక్ మొద‌ల‌య్యే అవ‌కాశాల్లేవ‌ని స‌మాచారం.

ఆంధ్రపదేశ్​లో త్వరలో పంచాయ‌తీ ఎన్నిక‌లు రానున్నాయి. అందుకోసం వ్యూహ ర‌చ‌న చేయాలని పవన్ అనుకుంటున్నాడట. ఇంత కీల‌మైన స‌మ‌యంలో సినిమా మొద‌లుపెడితే ఫ‌లితాలు తేడాగా వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని భావిస్తున్నాడట. అందుకే... ఇప్పుడే మూవీల వైపు రాకూడ‌ద‌ని నిర్ణయించుకున్నాడని సమాచారం. "మీరు క‌థ‌లు సిద్ధం చేసుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు మొద‌లెడ‌దాం" అంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఓ హింట్ ఇచ్చాడట పవర్ స్టార్. 2020 జ‌న‌వ‌రి వ‌ర‌కూ ప‌వ‌న్ సినిమాల‌పై నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశాల్లేవ‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇవీ చూడండి.. నటరాజ షాట్​తో అలరిస్తోన్న రణ్​వీర్​

ABOUT THE AUTHOR

...view details