ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సెట్లో పుష్పగుచ్ఛం అందించి విషెస్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
నిర్మాతకు పవర్‌స్టార్ బర్త్‌డే విషెస్.. వీడియో వైరల్ - పవన్ కల్యాణ్ ఏఎం రత్న
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
నిర్మాతకు పవర్‌స్టార్ బర్త్‌డే విషెస్
ఇప్పటికే పవన్ 'వకీల్‌సాబ్' షూటింగ్ పూర్తి చేసుకున్నారు. తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్ర షూటింగ్లో కొన్నిరోజులు పాల్గొన్నారు. దీనికి ఏఎం రత్నం నిర్మాత. ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో రానా మరో కీలకపాత్ర పోషిస్తున్నారు.