తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త. ఎట్టకేలకు పవన్ రీఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చింది. 'పింక్' రీమేక్​లో పవర్ స్టార్ నటించబోతున్నట్లు స్పష్టత వచ్చింది.

పవన్

By

Published : Nov 2, 2019, 2:35 PM IST

Updated : Nov 2, 2019, 8:06 PM IST

పవర్ స్టార్ అభిమానులకు శుభవార్త. పవన్‌ కల్యాణ్‌ను మళ్లీ వెండితెరపై చూపించేందుకు తెర వెనుక రంగం అంతా సిద్ధమైపోయింది. ఇప్పటికే ఆయన దర్శకుడు క్రిష్‌ చెప్పిన ఓ జానపద కథకు పచ్చజెండా ఊపేయగా.. తాజాగా 'పింక్‌' రీమేక్‌కు కూడా సై అన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఈ విషయంపై ట్వీట్ చేయగా నిర్మాత బోనీ కపూర్ రీట్వీట్ చేశారు. అంతే నెట్టింట సందడి నెలకొంది.

తరణ్ ఆదర్శ్ ట్వీట్

ఈ వార్తతో సందేహంలో ఉన్న ఫ్యాన్స్‌కు ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది. పవన్ కొత్త సినిమా ఖరారైందని తెలిసి అభిమానులు నెట్టింట సందడి చేస్తున్నారు. వెల్​కమ్ బ్యాక్ పవర్​స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​లో ఉంది. టాలీవుడ్‌ నిర్మాత దిల్‌రాజుతో కలిసి బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌ 'పింక్' సినిమాను నిర్మించబోతున్నారు. వేణుశ్రీరామ్‌ దర్శకత్వం వహించనున్నాడు.

'పింక్‌'లో బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించారు. 2016 సెప్టెంబరు 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం సాధించింది. ఇదే సినిమాను తమిళంలో అజిత్‌తో బోనీ కపూర్ నిర్మించారు. కోలీవుడ్‌లోనూ హిట్‌ అందుకుని, చక్కటి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమా సందడి చేయబోతోంది. పవన్‌ 2018లో వచ్చిన 'అజ్ఞాతవాసి'లో చివరిసారి వెండితెరపై కనిపించాడు. ఈ సినిమా తర్వాత ఆయన ఎన్నికల ప్రచారం, రాజకీయాలతో బిజీ అయ్యాడు.

ఇవీ చూడండి.. 'ఐకాన్​ ఆఫ్​ గోల్డెన్​ జూబ్లీ'గా రజనీకాంత్​

Last Updated : Nov 2, 2019, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details