పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వెండితెరపై మళ్లీ సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే రీ ఎంట్రీపై బాలీవుడ్ వర్గాల నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రస్తుతం పవన్ 'పింక్' రీమేక్‌తో పాటు క్రిష్ చెప్పిన మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందుగా ఈ నవంబరు 15న 'పింక్' రీమేక్‌ను లాంఛనంగా ప్రారంభించి.. జనవరి - ఫిబ్రవరి నాటికి తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసుకోనున్నాడట. ఈలోపు క్రిష్‌తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులను పూర్తి చేయాల్సిందిగా సదరు నిర్మాతలకు సూచించాడట.
అయితే ఇప్పుడీ రెండు చిత్రాలకు పవన్ తీసుకోబోతున్న పారితోషికం తెలుగు చిత్రసీమలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ రెండు సినిమాలకు పవర్ స్టార్ దాదాపు రూ.100కోట్ల మొత్తాన్ని అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఇంతకుముందు కూడా తెలుగు చిత్రసీమలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా పవన్‌కే పేరుండేది. ఇప్పటి వరకు పీకే ఓ చిత్రానికి అందుకున్న అత్యధిక మొత్తం రూ.40కోట్ల దాకా ఉంది.
నిజానికి 'పింక్' రీమేక్‌ను ఎంత మొత్తమైనా ఇచ్చి పవన్‌తోనే చేయించాలన్నది దిల్‌రాజు ఆలోచన . ఈ సినిమాకు పవన్ కేటాయించాల్సిన డేట్స్ కూడా చాలా తక్కువే. కేవలం 25 రోజుల్లోనే తన పాత్రను పూర్తి చేసేస్తారట. కానీ, పవన్‌పై ఉన్న అభిమానం, ఆయన సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల కారణంగానే దిల్‌రాజు రూ.50 కోట్లు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడట. అన్నట్లు ఈ చిత్రానికి దర్శకుడిగా వేణు శ్రీరామ్ పని చేయనున్నాడు.