తెలంగాణ

telangana

ETV Bharat / sitara

chiranjeevi birthday: మెగా ఫ్యామిలీలో సందడే సందడి - వరుణ్ తేజ్

మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు(chiranjeevi birthday celebrations) కన్నుల పండగగా జరిగాయి. పవర్​స్టార్​ పవన్ కల్యాణ్(Pawan Kalyan)​, రామ్​చరణ్ సహా మెగా కుటుంబం చేసిన సందడి ఆకట్టుకుంటోంది. చిరు ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్​కు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.

chiranjeevi birthday celebrations
పవన్ కల్యాణ్

By

Published : Aug 23, 2021, 4:41 PM IST

ఆదివారం(ఆగస్టు 22) జరిగిన మెగాస్టార్​ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు(chiranjeevi birthday celebrations) అంబరాన్నంటాయి. కుటుంబసభ్యులు సహా సన్నిహితులు, అభిమానుల మధ్య ఘనంగా సంబరాలు చేసుకున్నారు చిరు. ఈ సెలబ్రేషన్స్​కు పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్(Pawan Kalyan), నాగబాబు, రామ్​చరణ్, అల్లు అరవింద్, సాయి తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్​తో పాటు పలువురు ప్రముఖులు, అభిమానులు హాజరయ్యారు. వేడుకలకు సంబంధించి విడుదలైన వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అభిమానులు.. దర్శకులతో..

తొలుత దర్శకులు కొరటాల శివ, బాబీ సహా పలువురు సినీ పరిశ్రమ ప్రముఖలు హాజరై చిరుకు పుష్పగుచ్చం అందించారు. కొందరు అభిమానులు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. చిరుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హీరో శ్రీకాంత్​ సహా మరి కొందరు సన్నిహితుల మధ్య కేక్​ కట్​ చేశారు మెగాస్టార్. చిరుకు బర్త్​డే విషెస్ తెలిపేందుకు వందలాది అభిమానులు ఆయన ఇంటికి చేరుకున్నారు.

మెగా కుటుంబం సందడి..

కుటుంబానికి చిరంజీవి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. పుట్టినరోజు వేడుకల్లోనూ తమ్ముళ్లు, చెల్లెళ్లతో సరదాగా గడిపారు. చిన్న తమ్ముడు పవన్​ కల్యాణ్​కు మెగాస్టార్​, నాగబాబు ముద్దు ఇవ్వడం చూస్తుంటే అభిమానులకు కన్నుల పండగగా ఉంది. కుటుంబసభ్యుల మధ్య కేక్​ కట్​ చేసిన చిరు.. వారి నవ్వుల మధ్య మురిసిపోతూ కనిపించారు. పిల్లలంటే చిరుకు ప్రాణం. ఆఖర్లో చిన్నారులతో కలిసి ఆయన చేసిన సందడి ముచ్చటగా ఉంది.

ఇదీ చూడండి:Chiranjeevi Birthday: మెగాస్టార్​ బర్త్​డే సర్​ప్రైజ్​లు ఇవే

ABOUT THE AUTHOR

...view details