పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' టీజర్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీజర్ విడుదలైన వెంటనే సోషల్‌మీడియాలో ట్రెండ్ చెయ్యాలని ఉత్సుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఇప్పటికే ట్విట్టర్లో రచ్చ షురూ చేశారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఇదే కావడం వల్ల 'వకీల్ సాబ్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
'వకీల్ సాబ్' టీజర్‌తో ట్రెండ్ సృష్టిస్తారా? - పవన్ కల్యాణ్ వకీల్ సాబ్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 'వకీల్‌సాబ్' సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన నటించిన 'వకీల్ సాబ్' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. సంక్రాంతి కానుకగా టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు సోషల్‌మీడియా ట్రెండింగ్‌లో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు ఎదురుచూస్తున్నారు.
'వకీల్ సాబ్' టీజర్.. ట్రెండ్ చేసేద్దాం
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రం రూపొందింది. ఇందులో శ్రుతిహాసన్ కథానాయిక. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన 'పింక్' సినిమాకు తెలుగు రీమేక్ చిత్రమిది. నివేదా థామస్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. జనవరి 14న సాయంత్రం 6గంటల 3మూడు నిమిషాలకు టీజర్ విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.
ఇదీ చూడండి:నాలాంటి భార్యే కావాలట: శ్రుతి హాసన్