తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో వండర్​ ​వుమన్​-3 సీక్వెల్​ - తెలుగు సినిమా వార్తలు

హాలీవుడ్​ నటి గాల్​ గాడోట్ కథానాయికగా.. ప్యాటీ జెంకిన్స్​ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'వండర్​ వుమన్​ 1984'.  తాజాగా ఈ సినిమా డైరెక్టర్​ ప్యాటీ జెంకిన్స్​ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

patty Jenkins has already planned 'Wonder Woman 3'
త్వరలో సీక్వెల్​గా వండర్​ ​వుమన్​ 3

By

Published : Dec 10, 2019, 1:14 PM IST

Updated : Dec 10, 2019, 1:28 PM IST

హాలీవుడ్​ ప్రముఖ దర్శకురాలు పాటీ జెంకిన్స్ 2017లో తెరకెక్కించిన చిత్రం 'వండర్​ వుమన్'​. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్​లో భాగంగా 'వండర్​ వుమన్​ 1984' రాబోతోంది. గాల్​ గాడోట్​ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్​ ఇటీవలె విడుదలైంది. ఈ ప్రచార చిత్రంలో వండర్‌ వుమన్‌గా గాల్‌ చేసిన యాక్షన్‌ ఘట్టాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వచ్చే ఏడాది జూన్​ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం.

తాజాగా దర్శకురాలు జెంకిన్స్​ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్​గా వండర్ వుమెన్​- 3 చిత్రీకరించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపింది.

ఇప్పటికే 'వండర్​ వుమన్​ 3' కథను సిద్ధం చేసుకున్నాము. మరోవైపు అమెజాన్​తో​ సంయుక్తంగా స్పిన్​ ఆఫ్​ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాలను త్వరితంగా పూర్తి చేశాం. కానీ మూడో చిత్రానికి కాస్త విరామం ఇద్దామనుకుంటున్నాను. ఈ మధ్యలో వేరే సినిమాలు చేయాలనుకుంటున్నాను.

ప్యాటీ జెంకిన్స్, హాలీవుడ్ సినీ నటి

కామిక్స్​ ఆధారంగా ప్యాటీ జెంకిన్స్​ దర్శకత్వం వహించిన 'వండర్​ వుమన్'​ మొదటి భాగం 2017లో విడుదలైంది. ఈ చిత్రం ఎన్నో విమర్శలను అందుకున్నా.. బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. విడుదలైన మొదటి వారంలోనే రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది.

ఇదీ చూడండి: వెండితెర నాయికల '2019' ప్రయాణం సాగిందిలా..!

Last Updated : Dec 10, 2019, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details