సుశాంత్ ఆత్మహత్య కేసు విషయమై ముంబయి వెళ్లిన ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ చేశారని బిహార్ డీజీపీ ఆరోపించారు.
సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బిహార్ పోలీసు బృందం ఆదివారం, ముంబయి వెళ్లింది. అయితే ముంబయి నగరపాలక సంస్థ అధికారులు ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ బృందాన్ని రాత్రి 11 గంటలకు క్వారంటైన్‌కు పంపించారని డీజీపీ గుప్తేశ్వర్ పాండే వివరించారు.