ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో యూట్యూబ్ వేదికగా తన అనుభవాలు పంచుకుంటున్నారు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన 'నారప్ప' చిత్రం చూసిన ఆయన.. దగ్గుబాటి కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా రామానాయడు, సురేష్‌బాబు, వెంకటేశ్, రానా గురించి పలు విషయాలు వెల్లడించారు.
ఎన్టీఆర్ దైవం.. రామానాయుడు గాడ్‌ఫాదర్
'నారప్ప' చిత్రం చూడగానే.. రామానాయుడు, సురేష్, వెంకటేశ్, రానా గుర్తొచ్చారు. అందుకే వాళ్ల కుటుంబంలో అందరి గురించి జ్ఞాపకం చేసుకొని ఒక రుణం తీర్చుకోవాలి. ఎన్టీఆర్ గారిని దైవంగా భావిస్తే రామానాయుడు గారిని గాడ్ ఫాదర్‌గా భావించేవాళ్లం. 'నారప్ప' సినిమాను రామానాయుడు గారు చూసుంటే వెంకటేశ్ నటన చూసి ఎంతో సంతోష పడేవారని అనిపించింది. ఆయన ప్రపంచంలో బెస్ట్ జడ్జి. కథ వినగానే ఇది ఆడుతుందని అన్నది ఏదీ ఫ్లాప్ కాలేదు. కథ బాలేదు అంటే మనం సరిచేసి చెబితే ఇప్పుడు బానే ఉంది అని చెప్పేవారు. ఆయన 'ప్రతిధ్వని' కథ విన్నది 7-8 నిమిషాలు అంతే.. ఆడేస్తుందయ్యా అన్నారు.. మొగుడ్ని పెళ్లాం.. లాఠీ పెట్టి కొట్టిందంటే.. ఎగబడి వస్తారు మహిళలు. అలా సినిమా పాయింట్ పట్టుకునేవారు. 'ఈ పిల్లకు పెళ్లవుతుందా' సినిమా చూసి ఆ పాత్ర నువ్వు పోషిస్తున్నావ్ అని మురళి నన్ను వద్దన్నా పరుచూరి గోపాలకృష్ణ చేస్తేనే నేనీ సినిమా తీస్తానని మురళి మీద ఎదురు తిరిగారు. గొప్ప గొప్ప నిర్మాతలూ ఇప్పుడు మౌనంగా కూర్చుకుంటున్నారే తప్ప సినిమాలు తీయడం లేదు. ఏపీ ప్రసాద్, చలసాని గోపీ.. ఇలా రెగ్యులర్‌గా సినిమాలు తీసేవారు పుణ్యలోకాలకు వెళ్లిపోయారు. ఇంకా పెద్ద నిర్మాతలు ఉన్నారు కానీ వాళ్లసలు వీటి జోలికి రాకుండా..దూరంగా.. మౌనంగా.. బహుశా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ వాళ్లకు నచ్చట్లేదేమోనని అనిపిస్తుంది.. కానీ రామానాయుడు ఉన్నంత కాలం సినిమాలు తీస్తూ ఉండేవారు.
ఆ షీల్డ్ ఎదురుగా పెట్టుకునేవారు..
'ముందడుగు' టైటిల్ నచ్చకపోతే.. ఏంటండి.. మీతో ముందడుగు వేద్దామంటే వెనకడుగు వేస్తున్నారంటే.. భలే కొట్టావయ్య సెంటిమెంట్ మీద అని.. ఆరోజు నుంచి ఆయన పరమపదించేవరకు కూడా.. 'ముందడుగు' 25 వారాల షీల్డ్ ఆయన ఎదురుగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ సినిమా నన్ను 'ముందడుగు' వేయించిందని చెప్పేవారు.
ఆ పాట చరిత్ర..
'బలపం పట్టి భామ ఒళ్లో..' మూడో స్థానంలో ఉన్న పాట ఐదో స్థానంలో వేయమంటే..14వ రోజు రిలీజ్ పెట్టుకొని 10వరోజు మార్చడమా.. వెంకటేశ్‌కు ఈ పాట చాలా ఇష్టమంటే.. బాబు.. నీకు నాకు పందెం ఉంది. ఇది ఎన్ని కోట్లు చేస్తుందని.. మరి నేను పందెం గెలవద్దా అంటే. సరే.. మార్చుకోండి అన్నాను. అలా నా మాటను గౌరవించారు.
మూడో పాట గొప్పగా..