బిహార్ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులకు శిక్షణలో భాగంగా 'న్యూటన్' చిత్రాన్ని ప్రదర్శించినందుకు బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి హర్షం వ్యక్తం చేశాడు. ఎన్నికల్లో పాల్గొనే అధికారుల సమస్యల నేపథ్యంలో రూపొందిన చిత్రంతో అధికారుల్లో స్ఫూర్తి నింపుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్ ప్రధానపాత్రలో నటించగా.. పంకజ్ త్రిపాఠి కీలకపాత్ర పోషించాడు.
"సినిమా కథలకు అతీతంగా ఎవరినైనా ప్రభావితం చేసేంత వరకు.. మనం అభిమానులకు చేరవయ్యామని ఎప్పటికీ తెలియదు అనుకుంట. బిహార్‌లో 2500 మంది ఎన్నికల అధికారులకు శిక్షణలో 'న్యూటన్' చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాను ప్రదర్శించిన అధికారితో నేను మాట్లాడాను. ఇది ఈరోజు వరకు ప్రజల ఆదరణ పొందుతుంటడం చాలా సంతోషాన్నిచ్చింది. ముఖ్యంగా ఎన్నికల విధుల నుంచి తప్పుకోవాలని ప్రయత్నించేవారికి ఇది స్ఫూర్తినిస్తుంది. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు చాలా ప్రభావాన్ని చూపింది. నేను నటించిన చిత్రాల్లో కష్టపడి పని చేయడానికి ఈ సినిమా నన్ను ప్రేరేపిస్తుంది. మెరుగైన సమాజాన్ని సృష్టించడంలో ప్రజలకు ఇది దోహదపడుతుంది".
- పంకజ్ త్రిపాఠి, బాలీవుడ్ నటుడు