బాలీవుడ్ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలె డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో లత కోలుకొని ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని బాలీవుడ్ లెజెండ్ దిలీప్‌కుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
నా సోదరి లత కోలుకుంటోందని తెలిసి చాలా ఆనందపడ్డాను. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిందని విన్నాను. త్వరలోనే ఆమె మాములు మనిషి కావాలని ఆశిస్తున్నాను. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో లత.