తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ డైరీ: అంత పెద్ద అవార్డ్​ ఇస్తే ఆమె మాత్రం...

1962లో ఆస్కార్ అవార్డు అందుకున్న ప్యాటీ డ్యూక్.. అకాడమీ వేదికపై అతితక్కువ సేపు ప్రసంగించిన నటిగా నిలిచింది. 16 ఏళ్లకే పురస్కారం గెల్చుకుని థ్యాంక్యూ చెప్పేసి వేదిక నుంచి దిగిపోయింది.

By

Published : May 21, 2019, 1:21 PM IST

Updated : May 21, 2019, 2:42 PM IST

ఆస్కార్

ఆస్కార్ గెలవాలనేది సినీ పరిశ్రమలో ఉండే ప్రతిఒక్కరి చిరకాల కల. అంతటి ప్రతిష్టాత్మక పురస్కారం గెల్చుకున్నప్పుడు వేదికపైన భావోద్వేగంతో ప్రసంగిస్తుంటారు. అలాంటిది ఆస్కార్ చరిత్రలో అతి తక్కువసేపు మాట్లాడింది ఎవరిదో తెలుసా? 1962లో అకాడమీ అందుకున్న ప్యాటీ డ్యూక్​ ది. అవార్డు అందుకొని థ్యాంక్యూ అని చెప్పేసి వేదిక దిగిపోయింది.

'ద మిరాకిల్ వర్కర్'(1962) అనే హాలీవుడ్ చిత్రానికి ఉత్తమ సహాయ నటి కేటగిరీలో అకాడమీ అందుకుంది ప్యాటీ. అతి తక్కువ వయసులో (16)ఆస్కార్​ గెల్చుకున్న నటిగా రికార్డు సృష్టించింది. వేదిక మీదకు వచ్చి అవార్డు తీసుకుని ప్రసంగించిన ప్యాటీ ఈ మొత్తం తతంగాన్ని కేవలం 30 సెకండ్లలోనే పూర్తిచేసింది.

Last Updated : May 21, 2019, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details