తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం' - జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారం తన 37వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు పెద్దఎత్తున సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తారక్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.

తారక్
తారక్

By

Published : May 20, 2020, 7:33 PM IST

తనపై అమితమైన ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటానని కథానాయకుడు ఎన్టీఆర్‌ తెలిపారు. ఆయన బుధవారం తన 37వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులతోపాటు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కె. రాఘవేంద్రరావు, చిరంజీవి, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌ తదితరులు విష్‌ చేసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తారక్‌ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగంతో ట్వీట్‌ చేశారు.

"మీరు నా మీద చూపిస్తున్న అభిమానం వెలకట్టలేనిది. అన్నింటా నాకు తోడుగా వస్తున్న మీరే నా బలం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏం చేసి ఈ ప్రేమకు అర్హుడిని అవగలను? చివరి దాకా మీకు తోడుగా ఉండటం తప్ప"

-తారక్ ట్వీట్

తనకు శుభాకాంక్షలు చెప్పిన తోటి నటీనటులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు తారక్. ట్వీట్లన్నీ చదివానని, తన పుట్టినరోజును ప్రత్యేకం చేశారని చెప్పారు.

తారక్‌ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌ చరణ్‌ మరో కథానాయకుడు. దానయ్య నిర్మాత.

ABOUT THE AUTHOR

...view details