RRR: సినీ ప్రియులందరూ ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR). మార్చి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ మరోసారి ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్' నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్‌ని విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు సినిమాలో ప్రధానతారలైన రామ్‌చరణ్, తారక్, ఆలియా భట్‌తో కూడిన కొత్త పోస్టర్‌ని షేర్ చేసింది.
RRR: 'ఆర్‌ఆర్‌ఆర్' 'ఎత్తర జెండా' వీడియో సాంగ్ వచ్చేసింది - తారక్
RRR: 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా నుంచి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన 'ఎత్తర జెండా' వీడియో సాంగ్ వచ్చేసింది. ఇందులో తారక్.. చెర్రీ.. ఆలియా స్టెప్స్ అదరిపోయాయి.
"సినిమా చివర్లో 'ఎత్తర జెండా' అనే పాట నుంచి చూపించి మీ అందర్నీ సర్‌ప్రైజ్ చేయాలని మేము భావించాం. కాకపోతే, మా సంతోషాన్ని త్వరగా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే 'ఆర్‌ఆర్‌ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్'ని 14న విడుదల చేస్తున్నాం. ఈ పాటతో కౌంట్‌డౌన్‌ని ప్రారంభిద్దాం" అని రాజమౌళి పేర్కొన్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ పాటను సోమవారం సాయంత్రం 4గంటలకు విడుదల చేయాల్సి ఉన్నా, సాంకేతికంగా సమస్య తలెత్తడంతో రాత్రి 7గంటలకు 'ఎత్తర జెండా' పాటను విడుదల చేశారు. కీరవాణి స్వరాలు సమకూర్చగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఇక ఈ పాటకు ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియా కలిసి వేసిన స్టెప్‌లు ఓ ఊపు ఊపేస్తున్నాయి.
ఇదీ చూడండి:మహీంద్రా ఆఫీస్‌లో 'ప్రాజెక్ట్ కె'.. తొలి భారతీయ చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్'