తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా నుంచి కోలుకున్న తారక్ - కరోనా నుంచి కోలుకున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపిన ఆయన.. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

NTR
తారక్

By

Published : May 25, 2021, 10:33 AM IST

Updated : May 25, 2021, 10:46 AM IST

యంగ్​టైగర్ ఎన్టీఆర్​ కరోనా నుంచి కోలుకున్నారు. రెండు వారాలుగా డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపిన తారక్​.. ఈ కష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

"నాకు కరోనా నెగిటివ్​గా తేలిందని తెలిపేందుకు సంతోషిస్తున్నా. మీ ప్రార్థనలకు కృతజ్ఞతలు. నా ట్రీట్​మెంట్​కు సహకరించిన డా. ప్రవీణ్ కులకర్ణి, కిమ్స్​ డాక్టర్, నా కజిన్ డా.వీరు, టెనెట్ డయాగ్నస్టిక్స్​కు ధన్యవాదాలు. మీరంతా నా పట్ల చాలా శ్రద్ధ తీసుకుని కోలుకోవడంలో సాయం చేశారు. కరోనాను సీరియస్​గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తగిన శ్రద్ధ, పాజిటివ్​ దృక్పథంతో ఈ వ్యాధిపై గెలవచ్చు. వైరస్​పై పోరాటంలో మీ శక్తి ప్రధాన అస్త్రం. ధైర్యంగా ఉండండి. భయపడకండి. మాస్క్ ధరించండి. ఇంట్లోనే ఉండండి."

-తారక్, నటుడు

మే 10న కరోనా బారినపడ్డారు తారక్. అప్పటి నుంచి ఇంట్లోనే క్వారంటైన్​లో ఉన్నారు. డాక్టర్ల సూచనల మేరకు చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Last Updated : May 25, 2021, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details