ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్‌పై గుడ్‌గావ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ మాజీ సైన్యాధికారి ఈ ఫిర్యాదు చేశారు. ఆర్మీ దుస్తులను, చిహ్నాన్ని అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని అందులో పేర్కొన్నారు.
వెబ్ సిరీస్ వివాదంలో ఆ నిర్మాతపై పోలీస్ కేసు - ex-army personnel complaint against xxx 2
ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్‌పై గుడ్గావ్లో కేసు నమోదైంది. 'ఎక్స్ఎక్స్ఎక్స్ అన్సెన్సార్డ్ 2' అనే వెబ్‌సిరీస్‌లో ఆర్మీ దుస్తులపై అసభ్యకర సన్నివేశాలు చిత్రీకరించారంటూ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఓ మాజీ సైన్యాధికారి.
ఏక్తా కపూర్ రూపొందించిన 'ఎక్స్ఎక్స్ఎక్స్ అన్ సెన్సార్డ్ సీజన్-2' వెబ్ సీరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని 'ప్యార్ ఔర్ ప్లాస్టిక్' ఎపిసోడ్‌లో ఆర్మీ దుస్తులను ధరించిన ఓ వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడే సన్నివేశాలున్నాయి.ఫేస్బుక్ పేజీలో వెబ్ సిరీస్‌కు చెందిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆర్మీ వ్యక్తికి, ఓ మహిళకు సంబంధం ఉన్నట్లు చూపించడంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ అంశంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్, య్యూట్యూబ్ స్టార్ హిందుస్తానీ బౌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
44 ఏళ్ల ఏక్తాకపూర్ బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత దర్శకురాలు. 1994లో ఏర్పాటు చేసిన బాలాజీ టెలీ ఫిలింస్‌కు ఆమె క్రియేటివ్ హెడ్, జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల సినిమా రంగంలో ఏక్తా చేస్తున్న సేవలకు పద్మశ్రీ లభించింది.