ప్రముఖ మలయాళీ నటి కోజికోడ్ శారద (Kozhikode Sarada) కన్నుమూశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో సోమవారం.. కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేరిన ఆమె.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
అనారోగ్యంతో ప్రముఖ నటి కన్నుమూత
ప్రముఖ మలయాళీ నటి కోజికోడ్ శారద కన్నుమూశారు. 1979 నుంచి సినిమాల్లో నటిస్తున్న ఆమె.. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
కోజికోడ్ శారద
తొలుత నాటకాల్లో రంగ ప్రవేశం చేశారు శారద. ఆ తర్వాత 1979లో 'అంగక్కురి' అనే చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 1996లో వచ్చిన 'సల్లాపం' చిత్రంలో (Kozhikode Sharada Movies) కథానాయకుడి తల్లి పాత్ర ఆమె కెరీర్లోనే మరచిపోలేనిది. 70కి పైగా సినిమాల్లో నటించారు శారద. ఎన్నో సీరియళ్లలోనూ (Kozhikode Sarada Serial) నటించి మెప్పించారు.
ఇదీ చూడండి:పునీత్ రాజ్‌కుమార్‌కు 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' నివాళి