తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తాప్సీపై మరోసారి కంగన ఘాటు వ్యాఖ్యలు! - kangana tapsee

హీరోయిన్​ తాప్సీ స్వార్థపరురాలు అంటూ మరోసారి విమర్శించింది కంగనా రనౌత్. దేశమంతటా సుశాంత్​కు న్యాయం జరగాలని పోరాడుతుంటే.. దాన్ని దెబ్బతీసేందుకు తాప్సీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

tapsee
తాప్సీ

By

Published : Jul 26, 2020, 10:38 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్స్​ కంగనా రనౌత్​, తాప్సీ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. నువ్వా నేనా అంటూ మాటల యుద్ధంతో తలపడుతూనే ఉన్నారు. తాజాగా తాప్సీపై కంగన ట్విట్టర్ హ్యాండిల్​ టీమ్​​ పలు విమర్శలతో విరుచుకుపడింది. స్వార్థపరురాలు అంటూ ట్వీట్​ చేసింది. ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్​కు దేశమంతటా న్యాయం జరగాలని పోరాడుతుంటే.. ఆ పోరాటాన్ని తాప్సీ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించింది.

"కంగన లాంటి గొప్ప మహిళ అన్యాయంపై పోరాడుతుంటే.. దాన్ని తాప్సీ దెబ్బతీస్తోంది. తన కెరీర్​తో పాటు జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేసుకుంటోంది. సిగ్గు ఉండాలి. అయినా ఎన్నో ఇంటర్య్వూల్లో తనకి తానే బీ గ్రేడ్​ నటి అంటూ చెప్పుకుంది."

-కంగనా రనౌత్​, కథానాయకురాలు

ఇటీవల ప్రముఖ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగన.. తాప్సీ, స్వర భాస్కర్​ను బీ గ్రేడ్​ హీరోయిన్లుగా అభివర్ణించింది. చిత్రసీమలో బంధుప్రీతి లేకపోతే వారికి అవకాశాలు ఎందుకు రావట్లేదో చెప్పాలని ప్రశ్నించింది. ​

ఇది చూడండి సుశాంత్​ మృతి కేసులో విచారణకు మహేశ్​ భట్​

ABOUT THE AUTHOR

...view details