తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ట్రైలర్ విడుదల​ కోసం ప్రత్యేక కార్యక్రమం లేదు' - సిద్దార్థ్ ఆనంద్

'వార్' సినిమా ట్రైలర్​ విడుదలకు ప్రత్యేక ఈవెంట్​ ఏమి లేదని చెప్పాడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. అలాంటివి ఏమి చేయకపోయినా ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకముందని అన్నాడు.

వార్ ట్రైలర్

By

Published : Aug 24, 2019, 5:01 AM IST

Updated : Sep 28, 2019, 1:49 AM IST

బాలీవుడ్​ ప్రముఖ హీరోలు హృతిక్ రోషన్, టైగర్​ష్రాఫ్ నటించిన యాక్షన్ చిత్రం 'వార్'. ఈ చిత్రబృందం ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ట్రైలర్​ ఆవిష్కరణ కోసం ఎటువంటి కార్యక్రమం నిర్వహించట్లేదని చెప్పాడు దర్శుకుడు సిద్ధార్థ్ ఆనంద్.​​

"ఓ ఈవెంట్​ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు ఎటువంటి వాగ్దానాలు ఇవ్వాలని అనుకోవట్లేదు. కేవలం ట్రైలర్​తోనే వారికి సినిమాపై ఆసక్తి కలగజేయాలని అనుకుంటున్నాం. అందరితో పాటే మేము ప్రచార చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. సినిమా విషయంలో అభిమానులు మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాం.​" -సిద్ధార్థ్ ఆనంద్, దర్శకుడు

యశ్​ రాజ్​ ఫిల్మ్స్​ బ్యానర్​పై రూపొందుతున్న ఈ చిత్రంలో వాణీ కపూర్ హీరోయిన్​గా నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్​ ప్రపంచంలోని ప్రముఖమైన 7 దేశాల్లోని 15 నగరాల్లో జరిగింది. హాలీవుడ్​కు చెందిన ప్రముఖ యాక్షన్ డైరక్టర్స్​ నలుగురు ఈ సినిమాకు పనిచేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 2న థియేటర్లలోకి రానుంది.

ఇది చదవండి: 'నన్ను ట్రోల్​ చేయండి.. నాపై మీమ్స్ వేయండి'

Last Updated : Sep 28, 2019, 1:49 AM IST

ABOUT THE AUTHOR

...view details