తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఫ్యాన్స్ అమాయకులు.. వారిని నిందించొద్దు'

నటి మీరా చోప్రా విషయమై స్పందించిన సహనటి పూనమ్ కౌర్.. రాజకీయ లబ్ధి కోసమే అభిమానులను ప్రేరేపిస్తున్నారని.. వారంతా అమాయకులని తెలిపారు. ట్రోలింగ్స్​ నటీనటుల కెరీర్​లో సాధారణ విషయమని చెప్పారు.

No actor wants his fans to abuse anyone and dont blame fans for wars: Poonam Kaur
ఫ్యాన్​ అమాయకులు, వారిని నిందించొద్దు: పూనమ్​

By

Published : Jun 7, 2020, 3:47 PM IST

గత కొన్నిరోజుల నుంచి జూ.ఎన్టీఆర్‌ అభిమానులు, నటి మీరా చోప్రా‌ మధ్య వివాదం సాగుతోంది. తారక్‌ ఫ్యాన్స్​ అని చెబుతూ, కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మీరాచోప్రా ఇటీవలే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మరో నటి పూనమ్‌ కౌర్‌ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమవుతున్నాయి. తారల జీవితంలో ట్రోలింగ్‌ భాగమని, వాటిని పట్టించుకోకూడదని రాసుకొచ్చింది. అభిమానులు అమాయకులని, రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు వాళ్లను ప్రేరేపిస్తున్నారని చెప్పింది.

పూనమ్​ కౌర్​ ట్వీట్లు

"సరైన కారణం లేకుండా చాలామంది నా గురించి తప్పుగా ప్రచారం చేశారు. అసభ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పటివరకూ నేను ఏ ఒక్క అభిమానిపై ఫిర్యాదు చేయలేదు. వారు అమాయకులని నమ్ముతా. కొంతమంది మధ్యవర్తులు తమ స్వలాభం కోసం అభిమానులను ఇలాంటి విషయాల్లో ప్రేరేపిస్తున్నారు. అందుకే నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తులపై మాత్రమే ఫిర్యాదు చేశాను. నెట్టింట జరిగే గొడవలపై అభిమానులను నిందించొద్దు. తన ఫ్యాన్స్ వేరే వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించాలని ఎవరు కోరుకోరు. ట్రోలింగ్‌ చేస్తే బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని వదిలేసి మనం ప్రయాణం సాగించాలి" అని నటి పూనమ్​కౌర్​ వెల్లడించింది.

పూనమ్​ కౌర్​

"రాజకీయ లబ్ధిలో భాగంగా ఓ నటుడిపై బురద జల్లడం కోసం నకిలీ ఖాతాలు సృష్టించి అభిమానులమని చెప్పుకుంటున్నారేమో మనకు తెలియదు. మన ఇండస్ట్రీకి రాజకీయ పార్టీలతో సంబంధం ఉందని గ్రహించాలి. అభిమానులు అమాయకులు. కొంతమంది రాజకీయ నేతలు రాక్షసులు. అలాంటి వాళ్లే ఇలాంటివి చేస్తారు" అని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.

ఇదీ చూడండి... లిప్​లాక్​తో నటి సుస్మితాసేన్​ రీఎంట్రీ..!

ABOUT THE AUTHOR

...view details