నితిన్, నభా నటేష్ జంటగా మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న చిత్రం 'మాస్ట్రో'. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్ హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ చిత్ర బృందంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. అంతేకాదు అన్ని హక్కుల కొనుగోలు కోసం భారీ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై చిత్ర బృందం సదరు ఓటీటీ సంస్థతో చర్చలు జరుపుతోంది. ఆగస్టు నాటికి థియేటర్లు గాడిన పడినట్లయితే థియేటర్లలోకి తీసుకురావాలని, లేదంటే ఓటీటీకి తీసుకెళ్లాలని ప్రణాళిక రచిస్తున్నారు. ఏదైనా జులైలో పరిస్థితులు ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.