తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవ్వులు పూయిస్తున్న 'రంగ్ దే' ట్రైలర్

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'రంగ్ దే' చిత్ర ట్రైలర్​ యూట్యూబ్​లో రిలీజైంది. ప్రేమ, పెళ్లి నేపథ్య కథతో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Nithiin keerthy suresh Rang De trailer
నవ్వులు పూయిస్తున్న 'రంగ్ దే' ట్రైలర్

By

Published : Mar 19, 2021, 6:16 PM IST

Updated : Mar 19, 2021, 6:22 PM IST

నితిన్ 'రంగ్ దే' ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం హాస్యభరితంగా ఉంటూ, చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది. మార్చి 26న థియేటర్లలోకి రానుందీ సినిమా. ఇటీవల సెన్సార్​ పూర్తవగా అందులో యూ/ఏ సర్టిఫికెట్​ వచ్చింది.

ఈ రొమాంటిక్ లవ్​స్టోరీలో కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.

రంగ్ దే సినిమాలో సన్నివేశం
రంగ్ దే మూవీ సెన్సార్
Last Updated : Mar 19, 2021, 6:22 PM IST

ABOUT THE AUTHOR

...view details