తెలంగాణ

telangana

By

Published : Feb 13, 2021, 7:01 AM IST

ETV Bharat / sitara

హద్దులకు చెక్ చెక్.. విడుదలకు సినిమా సిద్ధం

పాటతో షూటింగ్ పూర్తి చేసుకున్న చెక్.. విడుదలకు సిద్ధమైంది. ఈనెల 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

nithiin check movie shooting completed.. ready to release
చెక్ సినిమాలో నితిన్-ప్రియా ప్రకాశ్ వారియర్

అడ్డులకింక చెక్‌ చెక్‌... హద్దులకింక చెక్‌ చెక్‌... అంటూ 'చెక్‌' చిత్రం కోసం పాడుకున్నారు నితిన్‌ - ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రమిది. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు. 'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను' అంటూ మొదలయ్యే ఈ చిత్రంలోని గీతాన్ని ఇటీవల గోవాలో నితిన్‌ - ప్రియపై షూటింగ్ చేశారు. దాంతో సినిమా మొత్తం పూర్తయిందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

చెక్ సినిమాలో నితిన్-ప్రియా ప్రకాశ్ వారియర్

"యాక్షన్‌కి థ్రిల్‌ను మేళవించి రూపొందించిన ఓ మంచి చిత్రమిది. కథానుగుణంగా సినిమాలో ఒక్క పాటకే చోటుంది. ఆ పాట అందరినీ అలరించేలా, మూడు రోజులపాటు గోవాలో అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. కల్యాణి మాలిక్‌ స్వరపరిచిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, శేఖర్‌ నృత్య రీతులు సమకూర్చారు. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. ట్రైలర్ విడుదల తర్వాత దీనిపై అంచనాలు పెరిగాయి. వాటిని తప్పకుండా అందుకుంటుందీ చిత్రం" అని నిర్మాత చెప్పారు.

చెక్ మూవీ

ABOUT THE AUTHOR

...view details