తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తల్లి కాబోతున్న నయనతార?.. కేసు పెట్టిన సామాజిక కార్యకర్త! - నయనతార విఘ్నేశ్​పై కేసు

Nayanthara becomes mother: లవ్​బర్డ్స్​ నయనతార-విఘ్నేశ్​ రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కొద్ది రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ మరో వార్త ప్రస్తుతం నెట్టింట్లో హాట్​ టాపిక్​గా మారింది. మరోవైపు వీరిద్దరు కలిసి ప్రారంభించిన నిర్మాణ సంస్థను బ్యాన్​ చేయాలంటూ ఓ సామాజిక కార్యకర్త కేసు పెట్టారు.

nayan vignesh
నయన్​-విఘ్నేశ్​

By

Published : Mar 22, 2022, 7:15 PM IST

Nayanthara becomes mother: హీరోయిన్ నయనతార తల్లి కాబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సరోగసి ద్వారా తల్లి అవ్వాలని నయన్​ అనుకుంటుందట. ఇందుకు ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్​ కూడా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నయన్​ చేతినిండా చిత్రాలతో ఫుల్​ బిజీగా ఉంది. అందుకే తల్లి కావడానికి సరోగసి మార్గాన్ని ఎంచుకున్నట్లు కోలీవుడ్​ వర్గాల సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొంతకాలం వేచి ఉండాల్సిందే.

2015లో తెరకెక్కిన 'నేనూ రౌడీనే' సినిమా షూటింగ్‌ సమయంలో నయన్‌కి విఘ్నేశ్‌ శివన్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటినుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట లాక్​డౌన్​లో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. కొంతకాలం నుంచి ఈ జంట పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ గుడిలో నయన్​-విఘ్నేశ్​ పూజలు నిర్వహించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో నయన్​ తన పాపిట సింధూరం పెట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో వీరిద్దరూ సీక్రెట్​గా పెళ్లి కూడా చేసుకున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా, నయన్​-విఘ్నేశ్​ కలిసి 'కాతువాక్కుల రెండు కాదల్‌' మూవీ సినిమా చేస్తున్నారు. విఘ్నేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార, సమంత, విజయ్‌ సేతుపతి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.​

నయన్​-విఘ్నేశ్​పై కేసు

complaint on Nayanthara and Vignesh shivan: నయనతార-విఘ్నేశ్​పై ఓ కేసు నమోదైంది. సలిగ్రమమ్​కు చెందిన కన్నన్​ అనే సామాజిక కార్యకర్త.. చెన్నై పోలీసు కమిషనర్​ ఆఫీస్​లో వీరిపై కేసు పెట్టారు. "రౌడీలను నియంత్రించేందుకు తమిళనాడు పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ​కానీ నయన్​-విఘ్నేశ్​ మాత్రం రౌడీ పిక్చర్స్​ అనే పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు. ఇది రౌడీలను ప్రోత్సాహించినట్లు అవుతుంది. కాబట్టి దీన్ని బ్యాన్​ చేయాలి" అని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నయన్​-విఘ్నేశ్‌ల పెళ్లి అయిపోయిందా?.. షాక్​లో ఫ్యాన్స్!​

ABOUT THE AUTHOR

...view details