విఘ్నేశ్ శివన్‌పై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టింది అగ్రకథానాయిక నయనతార. బిజీ షెడ్యూల్స్ నుంచి బ్రేక్ తీసుకుని కాబోయే భర్తతో సరదాగా గడిపింది. శనివారం విఘ్నేశ్ పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేసింది. విఘ్నేశ్ స్నేహితులందర్నీ పార్టీకి ఆహ్వానించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. 'రౌడీ పిక్చర్స్' నిర్మాణ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న కీలక సభ్యులు కూడా ఈ పార్టీలో సందడి చేశారు. నయన్ ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో విఘ్నేశ్ ఫిదా అయ్యారు. 'నా జీవితంలో భాగమైనందుకు, వరుస షూటింగ్స్, ఇతర పనులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ నాకోసం ఇంత అందమైన సర్‌ప్రైజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తంగమై' అని విక్కీ పేర్కొన్నారు.
కాబోయే భర్తకు నయన్ స్పెషల్ సర్‌ప్రైజ్ - నయనతార లేటెస్ట్ న్యూస్
తనకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. నయన్ తన ఇంట్లో ఏర్పాటు చేసిన స్పెషల్ పార్టీకి ఆశ్చర్యపోయినట్లు విఘ్నేష్ శివన్ తెలిపారు.
nayantara
'నేను రౌడీనే' షూటింగ్ సమయంలో నయనతార-విఘ్నేశ్ శివన్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వారి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇటీవల తమకు నిశ్చితార్థం జరిగిందని నటి నయన్ తెలిపారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నయన్ 'కాత్తువక్కుల రెందు కాదల్'లో నటిస్తున్నారు. దీనితోపాటు 'అన్నాత్తె' పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ ఆమె బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి: