Nayanathara Vignesh Shivan Marriage: లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌లకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ‘నానుం రౌడీదాన్’ మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట అప్పటి నుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరు లాక్‌డౌన్ సమయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లెప్పుడు అని అడగ్గా లాక్‌డౌన్ అనంతరం ఘనంగా చేసుకోవాలనుకుంటున్నామని సమాధానం ఇచ్చారు.
ఇక పెళ్లి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులు సోషల్‌మీడియాలో తాజాగా ట్రెండింగ్ అవుతున్న వీడియోను చూసి షాక్ అవుతున్నారు. పెళ్లి అయిపోయిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అసలు ఆ వీడియో ఏమిటంటే..
లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటి నుంచి నయనతార, విఘ్నేశ్‌లు దేశంలోని ప్రముఖ దేవాలయాలు అన్నీ సందర్శిస్తున్నారు. ఇటీవలే తమిళనాడులోని ఓ అమ్మవారి గుడికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న అభిమానులు.. వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
అలా ఓ అభిమాని పోస్టు చేసిన వీడియోలో నయనతార పాపిటపై కుంకుమ బొట్టు పెట్టుకొని కనిపించింది. అది చూసిన నెటిజన్లు.. నయనతారకు, విఘ్నేశ్‌కు పెళ్లి అయిపోయిందని, బయటకు చెప్పడం లేదని కామెంట్లు చేస్తున్నారు. అమ్మవారి గుడికి వెళ్తే ఎవరైనా కుంకుమ పెట్టుకుంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే ఈ జంట పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే ఈ జంట క్లారిటీ ఇచ్చేవరకు వేచి ఉండాల్సిందే.
కాగా, ప్రస్తుతం వీరిద్దరూ 'కాతువాక్కుల రెండు కాదల్' మూవీతో బిజీగా ఉన్నారు. విఘ్నేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నయనతార, సమంత, విజయ్ సేతుపతి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇదీ చదవండి: హృతిక్ 'క్రిష్ 4' సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే!