తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విలన్​గా కనిపించనున్న నయనతార - రజనీకాంత్

రజనీకాంత్ 'దర్బార్' సినిమా​లో నటిస్తోంది నయనతార. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఆమె కనిపించనుందని సమాచారం.

విలన్​గా కనిపించనున్న నయనతార

By

Published : Apr 19, 2019, 1:22 PM IST

నయనతార.. విభిన్న సినిమాలు చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటున్న హీరోయిన్​. గ్లామర్ పాత్రలే కాకుండా కథానాయిక నేపథ్యమున్న చిత్రాల్లోనూ నటిస్తూ అలరిస్తోంది. తాజాగా రజినీకాంత్​ కొత్త చిత్రం 'దర్బార్'లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో ఆమె కనిపించనుందని సమాచారం. పోలీస్​ పాత్రలో రజనీకాంత్ నటించనున్నారు. వీరిద్దరూ చంద్రముఖి, శివాజీ, కథానాయకుడు సినిమాల్లో జంటగా కనిపించారు.

రజనీకాంత్ 'దర్బార్' సినిమా పోస్టర్

ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్​గా కనిపించనున్నాడు.

ఇది చదవండి:రజినీ దర్బార్​లో విలన్​గా బాలీవుడ్ బబ్బర్

ABOUT THE AUTHOR

...view details