పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మార్కెట్లో ప్రజాస్వామ్యం'. స్నేహచిత్ర పతాకంపై ఆయనే స్వయంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రివ్యూను హైదరాబాద్లో ప్రదర్శించారు.
'ఈ సినిమా వచ్చే ఎన్నికల్లో మార్పు తెస్తుంది'
ఆర్. నారాయణమూర్తి నటించిన 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' చిత్రం ప్రివ్యూను ఇవాళ హైదరాబాద్లో ప్రదర్శించారు. తెలుగు సినీ దర్శఖులు, ప్రముఖులు హాజరై చిత్రాన్ని వీక్షించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
తెలుగు అగ్రదర్శకులు వి.వి.వినాయక్, పూరీ జగన్నాథ్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి సహా ప్రజాకవి గద్దర్ తోపాటు పలువురు సినీర్పముఖులు ఈ సినిమాను వీక్షించారు. ప్రస్తుత ప్రజాస్వామ్య దేశంలో నారాయణమూర్తి చూపించిన సందేశం వచ్చే ఎన్నికల నాటికి చక్కటి మార్పునకు శ్రీకారం చుడుతుందని, ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా నారాయణమూర్తితోపాటు చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నారాయణమూర్తి తెలిపారు.