తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామనే కారణంతో సుమారు 16మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు సెలబ్రిటీలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని వేడుకుంటున్నారు. దర్శకుడు మారుతి, హీరో రామ్ స్పందించగా.. తాజాగా నేచురల్ స్టార్ నాని ఈ జాబితాలో చేరాడు.
విద్యార్థుల ఆత్మహత్యలపై నాని భావోద్వేగం
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థులకు టాలీవుడ్ హీరో నాని ఓ సందేశాన్నిచ్చాడు. భావోద్వేగంతో ట్వీట్ చేశాడు.
విద్యార్థుల ఆత్మహత్యలపై నాని భావోద్వేగం
'చదువు అంటే నేర్చుకోవడం.. మార్కుల పత్రాలపై నెంబర్లు కాదు.. మీరు కోరుకున్నది సాధించలేకపోతే మరోసారి ప్రయత్నించండి. వదిలిపెట్టకుండా శ్రమించు. ఎందుకంటే జీవితం చాలా విలువైనది. మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ల గురించి ఓసారి ఆలోచించండి. మీ కుటుంబం మిమ్మల్ని ఇష్టపడుతుంది మీ ఇంటర్మీడియెట్ మార్కులు చూసి కాదు.. మీ మీద ఉన్న ప్రేమతో'
--నాని, టాలీవుడ్ హీరో