తెలంగాణ

telangana

By

Published : May 11, 2019, 12:41 PM IST

ETV Bharat / sitara

శ్రీకాంత్ అడ్డాలతో నేచురల్ స్టార్..!

కుటుంబకథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో నేచురల్​ స్టార్​ నాని ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

నాని

'జెర్సీ' చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు నాని. గతేడాది బాక్సాఫీస్ వద్ద విఫలమైన ఈ హీరోకు ఈ చిత్రంతో కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్'​ సినిమాలో నటిస్తున్నాడు నాని. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కెరియర్​లో 25వ చిత్రంలో నటించనున్నాడు. ఇటీవలే ఈ మూవీ టైటిల్​ లోగోను విడుదల చేసింది చిత్రబృందం.

తాజాగా నేచురల్ స్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కుటంబకథా చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథకు నాని ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. 'బ్రహ్మోత్సవం' ఫ్లాప్​తో మరో సినిమా చేయలేదు శ్రీకాంత్. ఇప్పుడు నానితో మరో కుటంబ కథా చిత్రం తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది చివర్లో ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇవీ చూడండి.. 'ఏబీసీడీ' సెన్సార్ పూర్తి.. 17న విడుద‌ల‌

ABOUT THE AUTHOR

...view details