తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లెట్ ద ఫన్ బిగిన్: 'వి' సినిమా ట్రైలర్ - వి సినిమా ట్రైలర్

సైకో పాత్రలో నాని, పోలీస్​గా సుధీర్​బాబు నటించిన 'వి' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వచ్చే నెల 5న ఓటీటీలో సినిమా విడుదల కానుంది.

లెట్ ద ఫన్ బిగిన్: 'వి' సినిమా ట్రైలర్
నాని-సుధీర్​బాబు

By

Published : Aug 26, 2020, 11:43 AM IST

ఎంతో ఆసక్తి కలిగించిన 'వి' చిత్ర ట్రైలర్ వచ్చేసింది. ఇందులో సైకో పాత్రలో నేచురల్ స్టార్ నాని, మరో కథానాయకుడిగా సుధీర్​బాబు నటించారు. సైకిక్ కిల్ల‌ర్‌, సిన్సియ‌ర్ పోలీస్​కు మ‌ధ్య సాగే ఛాలెంజింగ్‌ కథతో సినిమాను తెరకెక్కించారు. సెప్టెంబరు 5 నుంచి అమెజాన్ ప్రైమ్​లో సినిమా స్ట్రీమింగ్ కానుంది.

హలో మైక్ టెస్టింగ్ 1 2 3 అంటూ నాని మాటలతో ప్రారంభమైన ట్రైలర్.. "ఏ పని చేసిన ఎంటర్​టైనింగ్ చేయాలనేది నా పాలసీ", "జనరల్​గా ఇలాంటి సైకోలు పాపులారిటీ కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు", "ఇది సైడ్ బిజినెస్.. మెయిన్ బిజినెస్ వేరే ఉంది", "ఇలాంటి సైకోగాళ్లకు నీలాంటి పేరున్న పోలీస్ ఆఫీసర్లను ఛాలెంజ్ చేయడం కిక్కిస్తుంది" లాంటి డైలాగ్​లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో నివేదా థామస్, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటించారు. అమిత్ త్రివేది సంగీత దర్శకుడు. దిల్​రాజు నిర్మించగా, మోహన్​కృష్ట ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.

ABOUT THE AUTHOR

...view details