తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Cinema news: 'శ్యామ్​సింగరాయ్' మెలోడీ.. 'శేఖర్' గ్లింప్స్ - cinema news

(cinema news)సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శ్యామ్​సింగరాయ్, శేఖర్, ఫ్లాష్​బ్యాక్, బేడీయా చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

Cinema news
సినిమా న్యూస్

By

Published : Nov 25, 2021, 6:10 PM IST

*(shyamsingh roy movie songs)నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా 'శ్యామ్​సింగరాయ్'. డిసెంబరు 24న థియేటర్లలోకి రానుందీ చిత్రం. ఇందులో 'ఏదో ఏదో' అంటూ సాగే లిరికల్ సాంగ్​ను గురువారం(నవంబరు 25) రిలీజ్ చేశారు. ఈ పాటలో నాని, కృతిశెట్టి కనువిందు చేస్తున్నారు.

విభిన్న కథతో తీస్తున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కోల్​కతా నేపథ్యంగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు.

*రాజశేఖర్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'శేఖర్'. ఈ సినిమా గ్లింప్స్​ను గురువారం రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ అంచనాల్ని పెంచుతోంది.

ఇందులో రాజశేఖర్.. శేఖర్​ అనే రిటైర్డ్ పోలీస్​ అధికారిగా కనిపించనున్నారు. మలయాళ సినిమా 'జోసెఫ్'కు ఇది రీమేక్​! ఈ చిత్రానికి రాజశేఖర్​ సతీమణి జీవితా రాజశేఖర్​ దర్శకత్వం వహించారు. అను సితార, మస్కన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్​ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

*ప్రభుదేవా, రెజీనీ, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'ఫ్లాష్​బ్యాక్'. చిత్ర ఫస్ట్​లుక్​ను డైరెక్టర్​ కల్యాణ్​కృష్ణ విడుదల చేశారు. పోస్టర్లు చూస్తుంటే ఓ డిఫరెంట్​ కాన్సెప్ట్​తో సినిమా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఫ్లాష్​బ్యాక్ మూవీ ఫస్ట్​లుక్
ఫ్లాష్​బ్యాక్ మూవీ ఫస్ట్​లుక్

(anasuya tamil movie)అయితే ఈ సినిమానే అనసూయకు తొలి తమిళ సినిమా. ఇందులో ఆమె వేశ్య పాత్రలో నటిస్తోంది! డాన్ శాండీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

*బాలీవుడ్ యువ హీరో వరుణ్​ధావన్ కొత్త సినిమా ఫస్ట్​లుక్​ రిలీజ్ చేశారు. 'బేడీయా' టైటిల్​ కూడా ఖరారు చేశారు. తోడేలును పోలిన గెటప్​లో వరుణ్​ కనిపిస్తున్నారు.

వరుణ్​ ధావన్ బేడీయా మూవీ ఫస్ట్​లుక్

హాలీవుడ్​కు చెందిన ప్రముఖ వీఎఫ్​ఎక్స్​ సంస్థలు ఈ సినిమా కోసం పనిచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది నవంబరు 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details