తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సిక్స్​ప్యాక్​లో దర్శనమివ్వనున్న నేచురల్ స్టార్ - indraganti mohan krishna

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వస్తున్న 'వి' సినిమా కోసం కండలు పెంచబోతున్నాడు నాని. సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు సిక్స్​ ప్యాక్​లో దర్శనమివ్వనున్నాడు.

నాని

By

Published : Aug 8, 2019, 10:02 AM IST

నాని.. పక్కింటి అబ్బాయిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఎక్కువగా సింపుల్​గానే కనిపించే నాని మొదటి సారిగా కండలు పెంచనున్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో 'వి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం జిమ్​లో కసరత్తులు చేయనున్నాడు. నానికి ఇది 25వ సినిమా.

'వి' చిత్రంలో నాని పాత్ర విభిన్నంగా ఉండబోతుందట. మరి సిక్స్​ ప్యాక్​లో నేచురల్ స్టార్ ఎలా ఉంటాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

ఈ చిత్రంలో మరో హీరో సుధీర్ బాబు. అదితిరావ్ హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని ఇంతకు ముందే అష్టాచమ్మా, జెంటిల్​మన్ చిత్రాల్లో నటించాడు. ఈ రెండు సినిమాలు ఘనవిజయం సాధించడం వల్ల 'వి' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: 'మహానటి' దర్శకుడి మరో క్రేజీ ప్రాజెక్టు

ABOUT THE AUTHOR

...view details