తనలోని ప్రేక్షకుడికి నచ్చితే తన సినిమాలన్నీ విజయవంతమవుతాయని చెప్పాడు యువహీరో నాని. విభిన్న చిత్రాలు తెరకెక్కించే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'గ్యాంగ్ లీడర్'లో నటించాడు నేచురల్ స్టార్. ప్రియాంక మోహన్ హీరోయిన్. కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం జరిగిన విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నాడు నాని.
"చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్’కు, ఈ సినిమాకు సంబంధం లేదు. మాది నవ్విస్తూ ఆహ్లాదంగా సాగుతుంది. అందులోని ఒక సన్నివేశాన్ని మాత్రం ఇందులో చేశా. మెగాస్టార్ అభిమానులందరికీ ఇది నచ్చుతుంది. 'గ్యాంగ్‌లీడర్' టైటిల్‌తో వస్తున్న చిత్రంలో నటిస్తున్నానే ఆలోచనే నాలో ఉత్సాహాన్ని నింపింది". -నాని, హీరో