తెలంగాణ

telangana

ETV Bharat / sitara

17 ఏళ్ల తర్వాత ఆ దర్శకుడితో బాలకృష్ణ! - ENTERTAINMENT NEWS

నందమూరి బాలకృష్ణ.. 90వ దశకంలో తనకు మాస్ హిట్​లు ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్​తో కలిసి పనిచేసేందుకు మరోసారి సిద్ధమవుతున్నాడు. కొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

17 ఏళ్ల తర్వాత ఆ దర్శకుడితో బాలకృష్ణ!
దర్శకుడు బి.గోపాల్- హీరో బాలకృష్ణ

By

Published : Jan 8, 2020, 5:15 AM IST

బోయపాటి-బాలకృష్ణ కాంబినేషన్​కు ప్రస్తుతం ఎంత క్రేజ్​ ఉందో.. 90ల్లో బి. గోపాల్-బాలయ్య కలయికకు అంతకు మించే ఉండేది. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్​స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు', 'పల్నాటి బ్రహ్మనాయుడు'.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ముఖ్యంగా 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి' టాలీవుడ్​లో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మళ్లీ అదే కాంబో ఇప్పుడు ఓ సినిమా కోసం కలిసి పనిచేయనుందని సమాచారం.

ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదే కాకుండా ఇటీవలే విన్న కథల్లో ఒకటి బాలయ్యకు తెగ నచ్చేసిందట. దానికి గోపాల్​ అయితే సరైన రీతిలో తెరకెక్కించగలడాని నందమూరి హీరో భావించాడు. త్వరలో ఈ విషయంపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

2003లో చివరిసారిగా వీరిద్దరూ 'పల్నాటి బ్రహ్మనాయుడు' కోసం కలిసి పనిచేశారు. మళ్లీ ఇప్పుడు సినిమా చేస్తారో? లేదే? తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 2017లో గోపీచంద్ హీరోగా వచ్చిన 'ఆరడగుల బుల్లెట్' చిత్రాన్ని తీశారు బి.గోపాల్. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details