తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Dhee 13: 'ఆచార్య' పాట 'ఢీ'లో.. మీరు చూశారా? - ఢీలో ఆచార్య పాట

శ్రోతల మదిని దోచిన 'లాహే లాహే' పాట 'ఢీ' వేదికగా అలరించింది. నైనిక అనే కంటెస్టెంట్‌ 'ఆచార్య'లోని 'లాహే లాహే' పాటకి డ్యాన్స్‌ చేసి ఉర్రూతలూగించింది. తన హావభావాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను మీరు చూడకపోతే ఇక్కడ చూసేయండి.

nainika lahe lahe song performance
ఢీ వేదికలో లాహే లాహే

By

Published : Aug 5, 2021, 8:59 AM IST

Updated : Aug 5, 2021, 9:43 AM IST

'ఆచార్య' అనగానే అందరికీ గుర్తొచ్చే పాట 'లాహే లాహే'. అంతగా శ్రోతల మదిలో గూడుకట్టుకుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, మణిశర్మ సంగీతం, హారికా నారాయణ్‌, సాహితి గానం అత్యద్భుతంగా నిలవడమే ఇందుకు కారణం. లిరికల్‌ వీడియోలో చూపించిన చిరంజీవి, కాజల్‌, సంగీత స్టెప్పులు అదరహో అనిపించాయి. దాంతో వెండితెరపై ఈ పాటని ఎప్పుడెప్పుడా చూస్తామా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి ఇంకాస్త సమయం ఉండటం వల్ల ఆ సందడిని బుల్లితెరపైకి తీసుకొచ్చింది 'ఢీ' కార్యక్రమం.

ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 'ఢీ' 13: కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌'గా 'ఈటీవీ'లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. గత ఎపిసోడ్‌లో నైనిక అనే కంటెస్టెంట్‌ 'ఆచార్య'లోని 'లాహే లాహే' పాటకి డ్యాన్స్‌ చేసి ఉర్రూతలూగించింది. తన హావభావాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సుమారు 20 మందికిపైగా బృంద సభ్యులతో కలిసి చేసిన ఈ నృత్యం కన్నుల పండుగగా సాగింది. డ్యాన్సు మాత్రమే కాదు పాటకు తగ్గట్టు తీర్చిదిద్దిన దేవాలయం సెట్‌, వాళ్ల వేషధారణ అన్నీ ఆకట్టుకున్నాయి. మొత్తంగా వెండితెరపై 'లాహే' ఎలా ఉండబోతుందో ఓ ఉదాహరణగా బుల్లితెరపై ఆవిష్కరించారు. అందుకే వీళ్ల పర్ఫామెన్స్‌కి న్యాయ నిర్ణేతలతోపాటు టీం లీడర్లూ ఫిదా అయ్యారు. చూసిన ప్రేక్షకులూ వావ్‌ అన్నారు. యూట్యూబ్‌లో ఈ వీడియో అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుని, నెట్టింట టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇప్పటి వరకూ ఈ వీడియోను మీరు చూడకపోతే ఇక్కడ చూసేయండి.

ఇదీ చదవండి:షూటింగ్​లో నాగార్జున.. నవ్విస్తున్న 'వివాహ భోజనంబు' ట్రైలర్

Last Updated : Aug 5, 2021, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details