జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ తెలుగులో మొదటిసారి ఓ సినిమాను తీయనున్నాడు. ఈ చిత్రం తెరకెక్కించేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు. ఆది పినిశెట్టి, కీర్తి సురేశ్, జగపతిబాబు ప్రధానపాత్రలు పోషించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం.
బాలీవుడ్లో 'హైదరాబాదీ బ్లూస్', 'ఇక్బాల్', 'ధార్' వంటి చిత్రాలతో విమర్శకుల మెప్పు పొందాడీ దర్శకుడు.
"ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. తొలిసారిగా నా మాతృభాషలో సినిమా తీస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం తెరకెక్కించాలన్న ఆలోచన 20 ఏళ్ల క్రితమే వచ్చింది. కానీ ఇప్పటికి కుదిరింది. నేను వరుసగా ఏ జానర్నీ పునరావృతం చేయలేదు. అందుకే ప్రస్తుతం తీస్తున్న 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' వెబ్ సిరీస్ తర్వాత ఈ చిత్రాన్ని తీయాలనుకున్నాను." -నగేశ్ కుకునూర్, జాతీయ అవార్డు గ్రహీత
క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వికారాబాద్, పుణెలో షూటింగ్ జరుపుకోనుంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. సెప్టెంబర్ 2019లో విడుదల కానుంది.
ఇవీ చూడండి.. ప్రభాస్ 'సాహో' సెట్స్‌లో నితిన్ గడ్కరీ