తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Bigg Boss Telugu 5: అలా వాళ్లిద్దరూ సేఫ్‌.. హౌస్‌లో లెక్కలు మారాయి! - bigg boss captaincy task winner

బిగ్​బాస్​లో(nagarjuna bigg boss 5) ఈ వారం నామినేషన్స్​లో ఉన్న అనీ మాస్టర్​​, మానస్​ సేవ్ అయ్యారు. ఇక కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు(Nagarjuna Bigboss season 5 latest episode). మరి ఇందులో ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే! అప్పటివరకు ప్రోమోను చూసేయండి..

ane master
అని మాస్టర్​

By

Published : Nov 3, 2021, 9:32 AM IST

ఈ వారం నామినేషన్స్‌(Bigg Boss 5 Telugu) సందర్భంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆసక్తికర ఘటనలు జరిగాయి. సోమవారం(నవంబరు 1) జరిగిన ప్రక్రియలో కెప్టెన్‌ షణ్ముఖ్ తప్ప అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు(Nagarjuna Bigboss season 5 latest episode). కానీ, మరుసటి రోజు బిగ్‌బాస్‌ ఇచ్చిన 'జీవితమే ఒక ఆట' సమీకరణాలను మార్చింది. నామినేషన్స్‌లో ఉన్న అనీ మాస్టర్‌ సేవ్‌ అవ్వగా, ఆమెకు హోస్ట్‌ ద్వారా వచ్చిన పవర్‌తో మానస్‌ను నామినేషన్స్‌ నుంచి బయటపడేశారు.

ఒక్కొక్కరుగా గేమ్‌ నుంచి అవుట్‌ అవుతూ..

ఈ వా(Bigg Boss Telugu 5) ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయేందుకు నామినేట్‌ అయిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఒక అవకాశం ఇచ్చాడు. ఇందుకోసం 'జీవితమే ఒక ఆట' అనే టాస్క్‌ ఏర్పాటు చేశాడు. గార్డెన్ ఏరియాను మొత్తం మూడు భాగాలుగా విభజించారు. బ్యాగేజ్ జోన్.. సేఫ్ జోన్.. డేంజర్ జోన్.. చేశారు. 'ఏ సభ్యులైతే చివరిగా సేఫ్‌ జోన్‌ డోర్‌లోకి వెళతారో వారు, వారి దగ్గర ఏ సభ్యుల బ్యాగ్‌ ఉందో ఇద్దరూ డేంజర్‌ జోన్‌లోకి వెళతారు. అప్పుడు సేఫ్‌ జోన్‌లో ఉన్న నామినేటెడ్‌ సభ్యులు ఎవరిని సేఫ్‌ జోన్‌లోకి తీసుకురావాలనుకుంటున్నారో నిర్ణయించాల్సి ఉంటుంది' అని టాస్క్‌కు రూల్‌గా పెట్టాడు.

ఈ సందర్భంగా(Bigg Boss Telugu 5) ఇంటి సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఎవరికి వారు తమ పాయింట్‌ను ఇంటి సభ్యుల ముందు ఉంచారు. మధ్యలో కెప్టెన్‌ షణ్ముఖ్‌ బ్యాగులు ముడివేయటం వల్ల ఆట మరింత రసవత్తరంగా మారింది. చివరకు అనీ మాస్టర్‌ సేవ్‌ అయి, నామినేషన్స్‌ నుంచి బయటపడ్డారు. ఈ సందర్భంగా సన్నీ చేసిన రన్నింగ్‌ కామెంట్రీ నవ్వులు పంచింది. హోస్ట్‌ ఇచ్చిన స్పెషల్‌ పవర్‌ను ఉపయోగించి మానస్‌ను అనీ మాస్టర్‌ నామినేషన్స్‌ నుంచి కాపాడారు. అలా ఈ వారం(bigboss captaincy task) కెప్టెన్‌ షణ్ముఖ్‌, అనీ మాస్టర్‌, మానస్‌లు సేఫ్‌ అవ్వగా, శ్రీరామ్‌, రవి, సన్నీ, జస్వంత్‌ ,ప్రియాంక, విశ్వ, కాజల్‌, సిరి ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్‌ అయ్యారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ మొదలైంది. ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయారు. మరి ఇందులో ఎవరు గెలిచారు? ఎవరు ఓడిపోయారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!

ఇదీ చూడండి: Bigg Boss Telugu 5: బిగ్​బాస్​ హౌస్​ నుంచి లోబో ఎలిమినేట్‌!

ABOUT THE AUTHOR

...view details