Hey Sinamika pre release event Nagachaitanya: "నేనూ, దుల్కర్ సల్మాన్ సినిమాలు తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి చర్చించుకునేవాళ్లం. అలాంటిది మేం నటులవుతామని అస్సలు ఊహించలేదు" అని నాగ చైతన్య అన్నారు. 'హే సినామిక' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన నాగచైతన్య గత జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నారు. దుల్కర్, అదితిరావు హైదరీ, కాజల్ ప్రధాన పాత్రల్లో బృంద మాస్టర్ తెరకెక్కించిన చిత్రమిది. మార్చి 3న ప్రేక్షకుల ముందుకురానుంది.
నేను, దుల్కర్ అస్సలు అలా ఊహించలేదు: నాగ చైతన్య - Hey Sinamika pre release event Nagachaitanya
Hey Sinamika pre release event Nagachaitanya: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపారు యువ కథానాయకుడు హీరో నాగచైతన్య. తామిద్దరు నటులు అవుతారని అస్సలు ఊహించలేదని పేర్కొన్నారు. కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పారు.
ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ.. "బృంద మాస్టర్‌కు నేను పెద్ద అభిమానిని. ఎన్నో పాటలకు అద్భుతమైన నృత్యరీతులు సమకూర్చిన ఆమె దర్శకత్వం వహిస్తున్నారని తెలిసి ఎంతో ఆనందించా. మేం చెన్నైలో ఉన్న రోజుల్లో దుల్కర్ సల్మాన్‌తో పరిచయం ఏర్పడింది. పెద్దయ్యాక మా మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. చాలారోజుల తర్వాత దుల్కర్‌ను ఈ వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉంది. అప్పట్లో.. సినిమాలు మినహా అన్నింటి గురించి మాట్లాడుకునేవాళ్లం. అలాంటి మేం నటులవడం సర్‌ప్రైజ్‌గా ఉంది. ఎంపిక చేసుకున్న పాత్రకు 100 శాతం న్యాయం చేసి అన్ని భాషల వారిని మెప్పించే నటుడు దుల్కర్" అని అన్నారు. సినిమా మంచి విజయం అందుకోవాలని చైతన్య ఆకాంక్షించారు. "కురుప్’ సినిమా తర్వాత మరోసారి మీ ముందుకు వస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం" అని దుల్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు ప్రముఖ నిర్మాత సురేశ్‌బాబు, నటుడు జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు.