తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే హిందీ సినిమాలు చేయలేదు: రమ్యకృష్ణ - బాలీవుడ్ గురించి రమ్యకృష్ణ

దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు పొందిన నటి రమ్యకృష్ణ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తున్నారు. అయితే హిందీ చిత్రాల్లో నటించడంపై రమ్యకృష్ణను ఓ మీడియా ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

ramyakrishna about bollywood
రమ్యకృష్ణ

By

Published : Jun 18, 2020, 2:25 PM IST

దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ గుర్తింపు పొందిన ప్రముఖ నటి రమ్యకృష్ణ. 'కల్‌నాయక్‌' (1993), 'క్రిమినల్‌' (1995), 'శాపత్‌' (1997), 'బడే మియా చోటే మియా' (1998) వంటి చిత్రాలతో హిందీ ప్రేక్షకుల్ని అలరించారామె. ఆపై బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలో హిందీ సినిమాల్లో నటించడంపై రమ్యకృష్ణను ఓ మీడియా ప్రశ్నించగా స్పందించారు.

"నిజానికి నా సినిమాలు ఉత్తరాదిలో సరిగ్గా ఆడలేదు. ఇక్కడ నాకు వచ్చిన ఆఫర్లు కూడా ఆసక్తికరంగా లేవు. అందుకే ఇన్నేళ్లు నటించలేదు. దక్షిణాదిలో నేను విజయవంతంగా రాణిస్తున్నా"

-రమ్యకృష్ణ, సీనియర్ నటి

ప్రస్తుతం పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'ఫైటర్‌' (పరిశీలనలో ఉంది) సినిమాలో నటిస్తున్నారు రమ్యకృష్ణ. విజయ్‌ దేవరకొండ కథానాయకుడు. అనన్యా పాండే కథానాయిక. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ తల్లిగా రమ్యకృష్ణ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. "బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహర్‌ దీనికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉండబోతోంది. దాదాపు మరో 'బాహుబలి' కాబోతోంది" అని విశ్వాసం వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details