తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్యాన్సర్​తో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరణం - actor died

Music director died: మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథన్ కన్నుమూశారు. పలువురు సినీ ప్రముఖులతో పాటు కేరళ సీఎం పినరయి విజయన్​ ఈయనకు సంతాపం తెలిపారు.

Music director Kaithapram Viswanathan
మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథన్

By

Published : Dec 29, 2021, 5:49 PM IST

Kaithapram Viswanathan Namboothiri: ప్రముఖ సంగీత దర్శకుడు కైతప్రమ్​ విశ్వనాథన్ నంబూద్రి(58) తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్​తో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో బుధవారం మరణించారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

1963లో సంగీత దర్శకుల కుటుంబంలో పుట్టిన విశ్వనాథన్.. స్వాతి తిరునళ్ మ్యూజిక్ కాలేజీ నుంచి 'గానభూషణం' బిరుదును అందుకున్నారు.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథన్

ప్రాంతీయ పాఠశాలలో మ్యూజిక్ టీచర్​గా కెరీర్​ ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత సొంతంగా సంగీత ఇన్​స్టిట్యూట్​ను ప్రారంభించారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, దాదాపు 20 సినిమాలకు పనిచేశారు. 'కన్నకి' చిత్రానికిగానూ కేరళ రాష్ట్ర అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details