రేవ్‌పార్టీ(Mumbai Rave Party) కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను(Aryan Khan Arrest) అక్టోబరు 7 వరకు ఎన్సీబీ కస్టడీకి తరలిస్తున్నట్లు కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఎన్సీబీ అధికారులు ఆర్యన్‌తో పాటు మిగిలిన వారని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అయితే విచారణ పూర్తయిన తర్వాత ఆర్యన్ కోసం ఎన్సీబీ అధికారులు భోజనాన్ని తీసుకువచ్చారట. ఎన్సీబీ కార్యాలయం దగ్గర్లోని ఫుడ్కోర్ట్ నుంచి అధికారులు తెచ్చిన పూరిభాజి, పరాటా, దాల్ రైస్, బిర్యానీని ఆర్యన్ తిన్నాడట.
ఇంటి భోజనాన్ని తిరస్కరించిన ఆర్యన్ ఖాన్! - ముంబై రేవ్ పార్టీ
రేవ్‌పార్టీ(Mumbai Rave Party) కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్.. సోమవారం రాత్రి ఇంటి భోజనం తినేందుకు నిరాకరించాడట. అర్బాజ్ మర్చంట్ తండ్రి తెచ్చిన ఇంటి భోజనాన్ని తినేందుకు ఆర్యన్(Aryan Khan Arrest News) నిరాకరించడం వల్ల అతడి కోసం ఎన్సీబీ అధికారులు భోజనాన్ని ఏర్పాటు చేశారట. ఎన్సీబీ కార్యాలయం దగ్గర్లోని ఫుడ్‌కోర్ట్‌లో ఆహారాన్ని ఆర్యన్ కోసం తీసుకొచ్చారట.
అంతకుముందు సోమవారం రాత్రి కోర్టులో బెయిల్ పిటిషన్ ముగిసిన వెంటనే.. మరో నిందితుడైన అర్బాజ్ మర్చంట్ కోసం అతడి తండ్రి కోర్టుకు ఇంటి భోజనం తీసుకొచ్చాడు. 'నీకూ ఇంటి భోజనం తీసుకురామ్మంటావా?' అని అర్బాజ్ తండ్రి ఆర్యన్‌ను అడగ్గా.. అందుకు ఆర్యన్ తిరస్కరించాడు. దీంతో అతడి కోసం ఎన్సీబీ అధికారులు భోజనాన్ని తీసుకొచ్చారు. మంగవారం ఉదయం అర్బాజ్ తండ్రి మెక్‌డొనాల్డ్ నుంచి బర్గర్లు తీసుకొని రాగా.. దాన్ని అర్బాజ్‌కు అందించేందుకు అధికారులు తిరస్కరించారు.
ఇదీ చూడండి..Drugs Case News: డ్రగ్స్ కేసులో ఎన్సీబీ కస్టడీకి ఆర్యన్ ఖాన్