తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అన్​లాక్​ 4.0లో సినిమా థియేటర్లు తెరవండి' - bolly wood celebrities cinema halls

అన్​లాక్​ 4.0లో భాగంగా థియేటర్లను తిరిగి ప్రారంభించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు మల్టీప్లెక్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా సహా బాలీవుడ్​ ప్రముఖులు. దేశ ఆర్థిక వ్యవస్థలో సినిమా హాళ్లు అంతర్భాగమని అన్నారు.

థియేటర్ల
థియేటర్ల

By

Published : Aug 31, 2020, 7:26 AM IST

కరోనా కారణంగా థియేటర్లు మూతపడటం వల్ల సినీ పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటోంది. ఎంతో మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. అయితే సెప్టెంబరు 1 నుంచి లాక్​డౌన్​ 4.0 అమలులోకి రానుంది. ఈ క్రమంలో సినిమా హాళ్లను తిరిగి తెరిచేందుకు అనుమతివ్వాలని మల్టీప్లెక్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా సహా బాలీవుడ్​ ప్రముఖులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ బాలీవుడ్​ నిర్మాత బోనీ కపూర్​, నటులు పర్విన్​ దాబస్​, అభిమన్యు దస్సానీ, శిభాశిస్​ సర్కార్ ​సహా పలువురు వీరిలో ఉన్నారు. దాదాపు 2 లక్షలమంది భారత చిత్రపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని.. వారిని ఆదుకోవాలన్నారు.

"సినిమా హాళ్లు దేశ సంస్కృతిలో భాగం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం. ఎన్నో లక్షలమందికి జీవనోపాది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో థియేటర్లను ప్రారంభించారు. ఇక్కడ కూడా అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం."

-లేఖ సారాంశం

ఇటీవల లాక్​డౌన్​ 3.0లో భాగంగా సినిమా షూటింగ్​లకు అనుమతినిచ్చింది కేంద్రం. కానీ థియేటర్లకు మాత్రం ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు.

ABOUT THE AUTHOR

...view details