తెలుగు చలన చిత్రసీమలో 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా' లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న దర్శక నిర్మాత ఎం.ఎస్.రాజు. ఇప్పుడు రొమాంటిక్ ప్రేమకథతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు 'డర్టీ హరి' అనే టైటిల్ ఖరారు చేశారు.
రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఎంఎస్ రాజు చిత్రం - డర్టీ హరి
టాలీవుడ్ దర్శకనిర్మాత ఎంఎస్ రాజు నుంచి కొత్త చిత్రం రాబోతుంది. దీనికి 'డర్టీ హరి' అనే టైటిల్ ఖరారు చేశారు. రేపు (శనివారం) ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నారు.
ఎంఎస్ రాజు
ఎస్‌పీజే క్రియేషన్స్ పతాకంపై నిర్మితమయ్యే ఈ చిత్రానికి గూడూరి శివరామకృష్ణ, సతీష్ బాబు, సాయి పునీత్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను శనివారం ఉదయం 11.11 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ తన అధికారిక ట్విట్టర్లో ప్రకటించింది. అయితే ఇంకా చిత్రానికి సంబంధించిన నాయికానాయకులతో పాటు సాంకేతిక చిత్ర బృందాన్ని ప్రకటించాల్సి ఉంది.
ఇవీ చూడండి.. 'అసురన్' రీమేక్‌లో వెంకీకి జోడీగా ప్రియమణి..!
Last Updated : Jan 3, 2020, 1:34 PM IST