తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వాడీ-వేడీగా 'మా' జనరల్​ బాడీ సమావేశం

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) సర్వసభ్య సమావేశం వాడీవేడీగా సాగింది. 'మా' భవనం పైనే ప్రధానంగా చర్చ జరిగింది. సమావేశంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని సీనియర్‌ నటులు కృష్ణంరాజు, మురళీమోహన్‌లు తెలిపారు.

mohan babu
వాడి-వేడీగా 'మా' జనరల్​ బాడీ మీటింగ్​

By

Published : Aug 22, 2021, 7:31 PM IST

Updated : Aug 22, 2021, 7:56 PM IST

వాడీ-వేడీ ఆరోపణలు, చర్చలతో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పలువురు డిమాండ్‌ చేస్తుండగా, కరోనా పరిస్థితుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం.. 'మా' సర్వసభ్య సమావేశం వర్చువల్‌గా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల తేదీలపై 'మా' సభ్యులు భిన్నాభిప్రాయాలు తెలిపారు. కొందరు సెప్టెంబరు, మరికొందరు అక్టోబరులో నిర్వహించాలని అన్నారు. వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తామని సీనియర్‌ నటులు కృష్ణంరాజు, మురళీమోహన్‌లు తెలిపారు. డీఆర్సీ కమిటీ ఎలా చెబితే అలా చేస్తానని ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేశ్‌ తెలిపారు.

"జనరల్‌ బాడీ ఇలా సమావేశం అవడం సంతోషం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే పద్ధతి కొనసాగిస్తే మంచిది. వారం రోజుల్లో ఎన్నికల తేదీని ప్రకటిస్తాం. 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రస్తుతం సాధ్యం కాదు. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని, భౌతిక దూరం పాటిస్తూ వాటిని నిర్వహించాలి. సెప్టెంబరు రెండో వారం నుంచి అక్టోబరు రెండో వారం మధ్యలో ఏ తేదీ అనువుగా ఉంటుందో చూసి, అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తాం. అప్పటి వరకూ అందరూ సంయమనంతో ఉండండి."

- సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌

సమావేశంలో మాట్లాడుతున్న ప్రకాశ్​రాజ్​

"ఎన్నికలు జరగాలి. ఇప్పటివరకూ పనిచేసిన వారందరూ చక్కగా చేశారు. నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే సెప్టెంబరు 12వ తేదీ అవుతుంది. దీనిపై ఇక చర్చలు వద్దు. అవసరమైతే మరో వారం సమయం తీసుకోండి. అంతకుమించి పొడిగించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలి."

- అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్‌రాజ్‌

సమావేశంలో మాట్లాడుతున్న మోహన్​బాబు

"ఏం మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఎవరికి వారే యమునా తీరే. యథారాజా తథా ప్రజా. అందరూ మేధావులు. ఒకరిని అనే స్థితిలో మనం లేము. ఒక బిల్డింగ్‌ కొని, దాన్ని అతి తక్కువ ధరకు అమ్మడం ఎంత వరకూ సమంజసం అన్నది ఒక్కరైనా ఆలోచించారా? ఒక భవనం అమ్మేసి, మళ్లీ ఇప్పుడు కావాలనడం ఎవరైనా దీని గురించి మాట్లాడారా? ఎవరైనా సమాధానం చెబుతారా? ఇది నా మనసును కలిచి వేస్తోంది. రూపాయికి కొని, అర్ధ రూపాయికి అమ్మేస్తారా? నటనలో గొప్పవారైనందరూ నా ఫ్యామిలీ గొప్పంటే.. నా కుటుంబం గొప్ప అని కబుర్లు చెప్పుకొంటున్నారు. అందరూ ఆ భగవంతుడి ఆశీస్సులతో అందరం బతుకుతున్నాం. ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి."

- సీనియర్‌ నటుడు మోహన్‌బాబు

ఇదీ చూడండి :Prabhas: సలార్ అప్డేట్​ వచ్చేసింది!

Last Updated : Aug 22, 2021, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details