తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Pawan Kalyan: పవన్​కల్యాణ్ సినిమా మరింత ఆలస్యం! - పవన్ హరిహర వీరమల్లు మూవీ

పవన్, డైరెక్టర్ హరీశ్​ శంకర్​ కాంబినేషన్​లో తెరకెక్కాల్సిన సినిమా మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే పవన్​ ఆ ప్రాజెక్టులో భాగమవుతారు.

More Delay For pawan kalyan- harish shankar movie
పవన్​కల్యాణ్

By

Published : Jun 5, 2021, 5:25 PM IST

Updated : Jun 5, 2021, 5:35 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్.. 'హరిహర వీరమల్లు', 'అయ్యప్పనుమ్ కోశియమ్' రీమేక్​ సినిమాలతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత హరీశ్ శంకర్​ దర్శకత్వంలో నటిస్తారు. అయితే ఈ సినిమా ప్రారంభం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

దాదాపు రెండేళ్ల క్రితమే హరీశ్​ శంకర్​తో పవన్​ కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించారు. 'గబ్బర్​సింగ్' కాంబో మరోసారి అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్​ పూర్తవగా, సెట్స్​పైకి వెళ్లేందుకు చాలా ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఈనెలలోనే షూటింగ్​ మొదలుపెట్టాలనుకున్నారు కానీ కొవిడ్ వల్ల అది కాస్త ఆలస్యమవుతోంది. దీంతో వచ్చే ఏడాదే.. ఈ ప్రాజెక్టు సెట్స్​పైకి వెళ్లనుందని సమాచారం.

గబ్బర్ సింగ్ సినిమాలోని సన్నివేశం

ఇప్పటివరకు కనిపించని పాత్రలో ఈ సినిమాలో పవన్ చేయనున్నారు. 'సంచారి' అనే టైటిల్​ పరిశీలనలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, దేవి శ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 5, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details