Mohan babu manchu vishnu: కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఎన్నడూ లేనంతగా విడుదలకు ముందే ఈ చిత్రంపై వ్యతిరేకత వచ్చింది. సోషల్ మీడియాలోనూ మోహన్‌బాబుతో పాటు ఆయన కుటుంబంపై తెగ ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆయన ఓ నిర్ణయం తీసుకున్నారు. సదర్ మీమ్ పేజీల అడ్మిన్లకు లీగల్ నోటీసులు పంపించారు. రూ.10 కోట్ల దావా కూడా వేసినట్లు తెలుస్తోంది.
ట్రోల్స్, మీమ్స్ తనను ఎంతో బాధపెడుతున్నాయని మోహన్‌బాబు గతంలోనూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇద్దరు హీరోలు వెనకుండి ఈ పనిచేయిస్తున్నారని ఆరోపించారు. ఏదో ఓ సమయంలో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అన్నారు.