సూర్య హీరోగా.. 'ఎయిర్ డెక్కన్' సృష్టికర్త జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా 'ఆకాశం నీ హద్దురా' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'గురు' ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తుంది. ఇందులో జాకీష్రాఫ్, పరేశ్ రావల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం తెలిసింది. ప్రముఖ టాలీవుడ్ నటుడు ఇందులో విలన్‌గా తెరపై కనిపించనున్నాడు.
సూర్య చిత్రంలో విలన్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో - ఆకాశమే హద్దురా టీజర్
సూర్య- సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆకాశం నీ హద్దురా' చిత్రంలో విలన్ పాత్రను ప్రముఖ టాలీవుడ్ నటుడు పోషిస్తున్నాడు. ఈ సినిమా 'ఎయిర్ డెక్కన్' ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది.
తమిళంలో విలన్‌గా టాలీవుడ్ సీనియర్ నటుడు
డైలాగ్ కింగ్ మోహన్‌బాబు 'ఆకాశం నీ హద్దురా' చిత్రబృందం చెప్పిన కథకు అంగీకరించాడు. ఈ సినిమాలో అర్జున శక్తివేలుచామి పాత్రలో కనువిందు చేయనున్నాడు. ఈ చిత్రంలో అపర్ణా బాలమురళి హీరోయిన్గా నటిస్తోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నాడు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యనే స్వయంగా నిర్మిస్తున్నాడు. మార్చి నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి..'ఆకాశమే నీ హద్దురా' సినిమా టీజర్ వచ్చేసింది
Last Updated : Feb 29, 2020, 3:10 PM IST