మోదీ బయోపిక్ "పీఎం నరేంద్ర మోదీ" విడుదల తేదీ ప్రకటించినప్పటి నుంచి వివాదాల మయమే. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లనుఈ సినిమా ప్రభావితం చేస్తుందంటూ విపక్షాలు విమర్శలు చేశాయి. అన్ని అవాంతరాలు దాటుకుని ఎట్టకేలకు ఏప్రిల్ 11న రానుంది. మంగళవారం సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది. 2 గంటల 10 నిమిషాల నిడివితో ఉండనుందీ సినిమా.
'పీఎం నరేంద్ర మోదీ' చిత్రానికి సెన్సార్ పూర్తి - మోదీ బయోపిక్
'పీఎం నరేంద్ర మోదీ' సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఈచిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది.
సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం
వివేక్ ఒబెరాయ్..మోదీ పాత్రలో కనిపించనున్నారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: