బాలీవుడ్లో మరో మరణం. హిందీ, బెంగాలీ నటి మిస్తీ ముఖర్జీ.. కిడ్నీ విఫలం కావడం వల్ల శుక్రవారం బెంగళూరులో మరణించింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించారు. కీటో డైట్ వల్ల మిస్తీ ఆరోగ్యం క్షీణించిదని, గత 6-7 రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటా తుదిశ్వాస విడిచిందని పేర్కొన్నారు. దీంతో ఆమె తల్లి షాక్లో వెళ్లిందని చెప్పారు.
కొంపముంచిన డైటింగ్.. కిడ్నీ ఫెయిల్యూర్తో నటి మృతి
డైటింగ్ ప్రభావంతో, కిడ్నీ విఫలమై నటి మిస్తీ ముఖర్జీ చనిపోయింది. ఈమె మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
నటి మిస్తీ చక్రవర్తి
మిస్తీ.. సినిమాలతో పాటు పలు మ్యూజిక్ వీడియోలు చేసి గుర్తింపు పొందింది. ఈమెకు తల్లిదండ్రులతో పాటు ఓ సోదరుడు ఉన్నాడు.
ఇప్పటికే సుశాంత్ సింగ్, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, వాజిద్ ఖాన్, సరోజ్ ఖాన్ మరణాలతో దిగ్భ్రాంతి చెందిన చిత్రపరిశ్రమ.. ఈమె మృతిపై మరింత విచారం వ్యక్తం చేసింది.
Last Updated : Oct 4, 2020, 3:13 PM IST